ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా పెట్రోలు పోసి నిప్పంటించిన స్నేహితుడు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీలోని ఉప్పలవారిపాలేనికి చెందిన ఉప్పల అమర్నాథ్ స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఈ ఉదయం ఎప్పట్లానే రాజోలులో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్ స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొందరితో కలిసి వెంకటేశ్వర్‌రెడ్డి తనపై పెట్రోలు పోసి నిప్పు అంటించినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అమర్నాథ్ చెప్పాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)