ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ చెైనా ఇ-కామర్స్ వేదిక ఆలీ ఎక్స్‌ప్రెస్ నుంచి కొవిడ్ కంటే ముందే వస్తువును ఆర్డర్ చేశారు. అది ఇప్పుడు డెలివరీ అయిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు మీ వస్తువులూ డెలివరీ అవుతాయి' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆలీ ఎక్స్‌ప్రెస్‌ను కరోనా తర్వాత భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీన్ని నిషేధించకముందే ఈ వస్తువును కొనుగోలు చేసినట్లు అగర్వాల్ తెలిపారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. తాము కూడా 3-4 సంవత్సరాలు కిందట ఆర్డర్ చేసిన వస్తువుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మీ పోస్ట్ చూశాక ఎప్పటికైనా వస్తాయన్న నమ్మకం కుదిరింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు వస్తువు డెలివరీ !
June 24, 2023
0
Tags