అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని తిరుచ్చిలో గాయత్రి (23), విద్యా (21) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు  తిరుప్పూర్‌లోని ఒక టెక్స్‌టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటికి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆలయ ఉత్సవాల కోసం స్వగ్రామానికి ఇద్దరు వచ్చారు. గాయత్రి, విద్యాలు ఫోన్‌లో చాలాసేపు మాట్లాడుకోవడంతో వారి తండ్రి పిచ్చై, తల్లి అఖిలాండేశ్వరికి అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో తమకు ఉన్న సంబంధం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. మతాంతర సంబంధంపై వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంట్లో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత తిరిగి రాలేదు. గ్రామస్తులు ఓ బావి వద్ద గాయత్రి, విద్యల మొబైల్ ఫోన్లు, చెప్పులను గుర్తించారు. బావిలో వెతకగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు, ఫైర్‌ అండ్‌ రెస్క్యూ బృందాలు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. అక్కాచెల్లెళ్ల మొబైల్ ఫోన్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. .

Post a Comment

0Comments

Post a Comment (0)