బాలికకు మద్యం తాగించి, అత్యాచారం చేసిన యువకుడు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సతీష్ అనే యువకుడికి కొంతకాలం క్రితం ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచే ఆ బాలికపై కన్నేసిన అతగాడు మంచివాడిలాగా నటిస్తూ, ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెని లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తన స్నేహితులైన కళ్యాణ్, మణికంఠలకు తెలియజేశాడు. దీంతో వాళ్లు అతనికి సహకరించారు. మద్యం తాగించి, లాడ్జికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేయమని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్టుగానే కలవాలనుందని ఆ బాలికను ఓ ప్రాంతానికి పిలిపించాడు. ఆమెకు తెలియకుండా మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమె మత్తులోకి జారుతోంది. అప్పుడు సతీష్ ఆ బాలికని తీసుకొని, లాడ్జికి వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తులో ఉన్న ఆ బాలిక అతడ్ని ప్రతిఘటించలేకపోయింది. మత్తు నుంచి కోలుకున్న తర్వాత సతీష్ పాల్పడ్డ దారుణం తలచుకొని కుంగిపోయిన ఆ బాలిక, తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగి, సతీష్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 376 పోక్సో కేసు నమోదు చేశారు. అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులు పరారీలో ఉండగా, వారికోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపడంతో నిందితులపై కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)