న్యాయం జరగలేదని జడ్జి కారును ధ్వంసం చేసిన వ్యక్తి !

Telugu Lo Computer
0


కేరళలోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో దంపతులు విడాకుల కోసం పథనంతిట్ట కోర్టుకు వెళ్లారు. అయితే, ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు వారి కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కేసు విచారణ చేపట్టింది. అయితే, కోర్టులో తనకు న్యాయం జరగలేదని కోపంతో రగిలిపోయాడు. దీంతో కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన జడ్జి కారును ధ్వంసం చేశాడు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కాగా, న్యాయవాది, జడ్జి కలిసి తన గోడును సరిగా వినిపించుకోలేదన్న కోపంతో వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)