బీహార్ లోని భాగల్‌పూర్‌లో ఆదివారంనాడు నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలిపోయింది. అగువని సుల్తాన్‌గంజ్ గంగా బ్రిడ్జిని బీహార్‌లోని ఖగరియాలో రూ.1,700 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంలో ఉండగానే రెండు భాగాలు ఒకదాని వెంట మరొకటి కుప్పకూలాయి. ఈ ఘటనను కొందరు కెమెరాలతో చిత్రీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బ్రిడ్జిలోని 3 అడుగుల భాగం ఆ కిందనే ఉన్న గంగలో కుప్పకూలింది. తుఫాను కారణంగా గత ఏప్రిల్‌లో బ్రిడ్జిలోని కొంతభాగం దెబ్బతింది. బ్రిడ్జిలోని మధ్యభాగం గంగానదిపై ఖరియా, అగువని, సుల్తాన్ గంజ్ మధ్య నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఈ వంతెనలోని కొంత భాగం కుప్పకూలింది.
నిర్మాణంలో వున్నకుప్పకూలిన వంతెన !
June 04, 2023
0
Tags