కేంద్ర మంత్రి వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ !

Telugu Lo Computer
0


కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలీ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానంలో మంత్రితోపాటు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అసోం లోని గుహవాటి విమానాశ్రయంలో విమానాన్ని పైలెట్లు సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనను గురించి గుహవాటి ఎయిర్ పోర్టు వర్గాలు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం 8.40 నిమిషాలకు అసోంలోని గుహవాటి విమానాశ్రయం నుంచి డిబ్రుగఢ్ కి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి వెనక్కి వచ్చింది. అయితే టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్ లో లోపం ఉన్నట్లు పైటెల్స్ గమనించడంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చిందని అధికారు తెలిపారు. ఈ విషయంపై కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీ మాట్లాడుతూ.. 'ఈ రోజు నాకు మంచిరోజు.. నాతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్, తెరస్ గోవల్లాతో కలిసి విమానంలో బయలుదేరాను. టింగ్ ఖాంగ్, దులియాజన్, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాలి.. మా విమానం గాల్లోకి వెగిరిన కొద్దిసేపటికే గుహవాటి ఎయిర్ పోర్టు లో ఎమర్జేన్సీ ల్యాండ్ అయిందని తెలిపారు.. మేం అంతా సురక్షితంగానే ఉన్నాం' అని అన్నారు. కాగా, దిబ్రూగఢ్ వెల్లవలసిన ఇండిగో విమానం అత్యవసరంగా దిగిందని గువహాటీ ఎయిర్ పోర్టు వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)