ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తన కొడుకుతో పాటు 68 ఏళ్ల వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. వీరుంటున్న ప్రాంతంలోనే ఓ 16 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో నివాసం ఉంటుంది. అయితే, ఈ 68 ఏళ్ల వృద్ధుడు ఆ బాలికపై కన్నేశాడు. ఎలాగైన ఆ అమ్మాయితో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 20 ఆ వృద్ధుడు ఆ బాలికను నమ్మించి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఇదంతా అతని కుమారుడు గమనించాడు. ఆ బాలికను తీసుకెళ్లి క్షుద్రపూజలు చేస్తున్నాడేమోనని ఆ యువకుడు అనుమానించాడు. ఎలాగైనా తండ్రిని పట్టుకోవాలని ఆ వృద్దుడి కుమారుడు అతను ఉన్న రూమ్ లో సీక్రెట్ గా మొబైల్ లో వీడియో ఆన్ చేసి వెళ్లిపోయాడు. ఒక గంట తర్వాత అతడు వచ్చి ఆ వీడియో రికార్డ్ ఆఫ్ చేశాడు. తండ్రి ఏం చేశాడోనని ఆ వీడియోను చూడగా ఆ వృద్ధుడు ఆ బాలికను బెదిరించి బలవంతంగా అత్యాచారం చేశాడు. దీనిని చూసి ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇదే వీడియోను అతడు ఆ బాధిత బాలిక తండ్రికి పంపాడు. ఇది చూసిన ఆ బాలిక తండ్రి నమ్మలేకపోయాడు. వెంటనే ఆ వీడియోను పోలీసుల వద్దకు తీసుకెళ్లి ఆ తర్వాత ఈ దారుణంపై ఫిర్యాదు చేశాడు. బాధిత బాలిక సైతం జూన్ 27న జరిగిందంతా పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడైన ఆ 68 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారింది. https://t.me/offerbazaramzon
బాలికపై వృద్ధుడి అత్యాచారం !
June 30, 2023
0
Tags