బీహార్‌లో కూలిన మరో వంతెన

Telugu Lo Computer
0


బీహార్ లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన లోని కొంతభాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకు పోయినట్టు చెప్పారు. జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా, ఇంతలోనే కూలిపోయినట్టు చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏదీ జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 4న ఈ రాష్ట్రంలో ఖగడియా జిల్లా భగల్‌పూర్‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిపోగా, ఆ తర్వాత కిషన్‌గంజ్ జిల్లాలో మెచ్చినదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మిస్తున్న వంతెన కొంతభాగం కూలింది. నెల వ్యవధిలోనే మూడు ఘటనలు జరగడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)