చెరుకుకు కనీస మద్దతు ధర పెంపు

Telugu Lo Computer
0


చెరుకుకు కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో చెరుకుకు మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్వింటాలకు రూ.10 నుండి రూ. 315 కు పెంచినట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. ఈ స్థాయిలో చెరుకుకు మద్దతు ధర పెంచడం దేశంలోనే తొలిసారి అని అనురాగ్ ఠాకుర్ తెలిపారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల 5 కోట్ల మంది చెరుకు రైతులకు లబ్ధి చేకూరుతుందని, అలాగే చక్కెర కర్మాగారాల్లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుదని ఆయన తెలిపారు. 2014-15 సీజన్‌లో క్వింటాల్‌కు రూ.210 ఉన్న చెరకు ఎఫ్‌ఆర్‌పి ఇప్పుడు 2023-24 సీజన్‌కు క్వింటాల్‌కు రూ.315కి పెంచినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా యూరియా రాయితీ పథకాన్ని కూడా కొనసాగించాలని కేబినెట్ ఈ భేటీలో నిర్ణయం తీసుకుంది. రూ. 3,68,678 కోట్లతో యూరియా రాయితీ అలాగే కొనసాగించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే మార్కెట్ల అభివృద్ధికి రూ.1451 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపడుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)