వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులలో తేలికపాటి నుంచి ఒక  మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. శనివారం రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇవాళ, రేపు కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. కోస్తాంధ్రలో  రానున్న మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అటు రాయలసీమ జిల్లాలోను మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే చాన్స్ లేకపోలేదన్నారు. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)