రైలు ప్రమాదంలో 238 మంది మృతి

Telugu Lo Computer
0


ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో 238 మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ ఘటనలో 900 మంది దాకా గాయాలపాలయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ రైలు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆ జిల్లా యంత్రాగంతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  'రైలు ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాము. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ని పిలిపించి, ఆయనతో కూడా విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుతం దృష్టి అంతా రెస్క్యూ ఆపరేషన్‌, గాయపడిన వారికి చికిత్స చేయడం పైనే ఉంది. మరణించిన వారి కుటుంబాలకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. నిన్న రాత్రి నుంచి రైల్వే జాతీయ విపత్తు దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు సహాయక చర్యల్లో నిమగమై ఉన్నాయి.' అని ఆయన అన్నారు. కాగా, ఈ సందర్భంగా ఈ పెను విషాదానికి సంబంధించి ప్రతిపక్షాలు రైల్వే మంత్రిని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయని మీడియా ప్రతినిధులు అశ్విని వైష్ణవ్‌ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. 'ప్రస్తుతం నా దృష్టి అంతా రెస్క్యూ రిలీఫ్‌పై పెట్టాలి.' అని అశ్విని వైష్ణవ్‌ బదులిచ్చారు. అలాగే 'జిల్లా యంత్రాంగం క్లియరెన్స్‌ ఇచ్చిన వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తాం.' అని వైష్ణవ్‌ అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ పూర్తయిన తర్వాతే తెలుస్తుంది అని వైష్ణవ్‌ మీడియా ప్రతినిధులకు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)