మధ్యాహ్న భోజనంలో పాము !

Telugu Lo Computer
0


బీహార్‌లోని అరారియాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ సిబ్బంది కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్‌లో పాము కనిపించింది. వెంటనే ఆ ఆహారాన్ని పడవేయగా, అప్పటికే భోజనం చేసిన పిల్లల ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. కొందరు పిల్లలు వాంతులు చేసుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆహారం తిన్న తర్వాత వంద మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో ఆరోగ్యం విషమంగా ఉన్న 25 మంది పిల్లల్ని ఆసుపత్రిలో చేర‍్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వంట చేసి దానికి ఓ సప్లయర్ తీసుకువస్తాడు. పాఠశాల యాజమాన్యం తప‍్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు తెలిపారు. కాగా ఛప్రాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మే18న బల్లి కనిపించిన ఘటన మరవకముందే ఈ ఘటన జరగడం గమనార్హం 

Post a Comment

0Comments

Post a Comment (0)