మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు కన్నుమూత

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు (66) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు దొమ్మేటి వెంకటేశ్వరరావు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగా ఈయనకు పేరుంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ పని చేశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, దొమ్మేటి వెంకటేశ్వరరావు ఫౌండేషన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నమూయడం గమనార్హం. దొమ్మేటి మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)