గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని ఇవ్నాగర్ గ్రామంలో దక్షా బమనియా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు మీనాక్షి (19) అనే కూతురు ఉంది. ఈ యువతి మధ్యే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. ఈ యువతి తల్లిదండ్రుల కళ్లు గప్పి స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపించింది. సమయం దొరికినప్పుడల్లా చదువు పేరుతో బయటకు వెళ్లి ప్రియుడితో తిరిగేది. ఇటీవల తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడిని మీనాక్షి ఏకంగా ఇంటికే రప్పించుకుంది. ఇదే సమయంలోనే మీనాక్షి తల్లి సడెన్ గా ఇంట్లోకి వచ్చింది. కూతురుని ప్రియుడితో చూడకూడని స్థితిలో చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో వెంటనే మీనాక్షి ప్రియుడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. తల్లి మాత్రం కూతురిపై మాటలతో దాడి చేసింది. ఈ విషయాన్ని నాన్నకు చెప్పద్దంటూ మీనాక్షి తల్లిని వేడుకుంది. అయినా మీనాక్షికి నమ్మకం కుదరలేదు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో తెలియక తల్లిని హత్య చేయాలని భావించింది. తాను అనుకున్నట్లే ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో తల్లిని కొట్టి దారుణంగా హత్య చేసింది. ఇక సాయంత్రం మీనాక్షి తండ్రి ఇంటికి వచ్చి చూడగా భార్య దక్షా బమనియా రక్తపు మడుగులో పడి చనిపోయి కనిపించింది. అతడు షాక్ గురై ఏం జరిగిందో తెలియక వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, హత్య జరిగిన సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు. కూతురు ఇంట్లోనే ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ యువతిని ప్రశ్నించారు. నేను అప్పుడు నిద్రలో ఉన్నానని, నాకేం తెలియదంటూ పొంతనలేని సమాధానాలు చెప్పింది. కానీ, ఎందుకో ఆ యువతి తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఇక గట్టిగా విచారించే సరికి మా అమ్మను నేనే హత్య చేశానంటూ తన నేరాన్ని అంగీకరించింది. నా ప్రియుడితో ఇంట్లో ఉండగా చూసిందని, ఎవరికైన చెబుతుందనే భయంతోనే మా అమ్మను హత్య చేశానని తెలిపింది. దీంతో పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడితో కలిసివుండగా చూసిందని తల్లిని చంపిన తనయ !
May 30, 2023
0
Tags