రూమ్‌మెట్‌ని క్షణికావేశంలో చంపింది !

Telugu Lo Computer
0


దక్షిణ ఢిల్లీ, మజ్ను కా తిల్లాలోని ఓ భవనంపై మహిళ మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. పార్టీలో జరిగిన గొడవలో బాధిత మహిళను తన రూమ్‌మెంట్‌ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాణి (35) గురుగ్రామ్‌లోని బ్యూటీ పార్లలో పనిచేస్తోంది. సాప్న(36) వెయిటర్‌ గా చేస్తోంది. వీరిరువురూ ఒకే గదిలో రెంట్‌కు ఉంటున్నారు. నిన్న జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న సాప్న,  రాణి తండ్రిని దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే గొడవ మరుసటి రోజు ఉదయం 4 గంటలకు మళ్లీ మొదలైంది. విచక్షణ కోల్పోయిన సాప్న రూమ్‌లో ఉ‍న్న కత్తితో రాణిపై దాడి చేసింది. రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రాణి మృతదేహం భవనం టెర్రస్ పైన పడి ఉందని పోలీసులు తెలిపారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న సాప్నకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు వెల్లడించారు. సాప్న నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)