సీబీఐ విచారణ నుంచి వినహాయింపు ఇవ్వాలన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సీబీఐ అరెస్టు, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అంతేగాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. అయితే అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 25న విచారించాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పక్షాలు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు వాదనలు వినిపించాలని పేర్కొంది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు అదేరోజు నిర్ణయం చెప్పాలని ఆదేశించింది . ఏప్రిల్ 24 తర్వాత ఎన్నిసార్లు సీబీఐ విచారణకు వెళ్లారని అవినాష్ న్యాయవాదులను ప్రశ్నించింది. సుప్రీం ఉత్తర్వుల తర్వాత మూడుసార్లు సమన్లు ఇవ్వగా ఒక్కసారి కూడా సీబీఐ విచారణకు వెళ్లలేదని ప్రతివాది సునీత లాయర్ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే సీబీఐ అధికారులు అరెస్టుకు వెళితే నానా హంగామా చేశారని వెల్లడించారు. దీంతో అవినాష్ తరుపు న్యాయవాది సునీత లాయర్ జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి పిటిషన్‌లోనూ జోక్యం చేసుకుంటున్నారని వాధించగా ఎందుకు అంత అసహనం వ్యక్తం చేస్తున్నారని కోర్టు అవినాష్ లాయర్‌ను ప్రశ్నించగా అందుకు ఆయన కోర్టుకు క్షమాపణలు తెలిపారు.
సీబీఐ అరెస్టు, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేం !
May 23, 2023
0
Tags