జిఎస్‌ఎల్‌వి-ఎఫ్12 నేవిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్-01ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.46 గంటలకు ఇస్రో జిఎస్‌ఎల్‌వి రాకెట్ నావిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్-01ను నింగిలోకి మోసుకెళ్లింది. సుమారు 2232 కిలోల బరువున్న ఎన్‌విఎస్-01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే జిఎస్‌ఎల్‌విఎఫ్12 ఉదయం 10.42 గంటలకు ఎన్‌డిఎస్‌సి రెండో లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరింది. ఇది భారత దేశపు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్(జిఎస్‌ఎల్‌వి) 15వ ఫ్లయిట్. స్వదేశీ క్రయో స్టేజ్ 9వ ఫ్లయిట్. జిఎస్‌ఎల్‌విఎఫ్12 ఉపగ్రహం ఎన్‌విఎస్-01ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ఉంచుతుంది. 2023 ఫిబ్రవరిలో ఎస్‌ఎస్‌ఎల్‌వి ప్రయోగం తర్వాత ఇది ఇస్రో నాల్గవ ప్రయోగం.
జిఎస్‌ఎల్‌వి-ఎఫ్12 ప్రయోగం విజయవంతం
May 29, 2023
0
Tags