ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఒహియో స్టేట్ పైన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాడు. అతను కొలంబస్ ఫ్రాంక్లింటన్‌లోని ఫ్యూయల్ స్టేషన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఇద్దరు దుండగులు ఇంధన స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సాయిష్‌పై కాల్పులు జరిపి నగదు తీసుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయిష్‌ను ఒహియో హెల్త్ గ్రాంట్ మెడికల్ సెంటర్‌కు తరలించిగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై గురువారం రాత్రి 8 గంటలకు సమాచారం అందిందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పాలకొల్లు పట్టణానికి చెందిన వీర రమణ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. అతని చిన్న కుమారుడు సాయిష్ అమెరికాలోని ఓహియో స్టేట్ పైన్స్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లిన సాయిష్, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు ఎంఎస్ చివరి సెమిస్టర్ చదివేందుకు గ్యాస్ స్టేషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేశాడు. అతడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయిష్ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికాలో తెలుగు విద్యార్థి హత్య !
April 21, 2023
0
Tags