తమ రహస్యాలను బయటపెడతారనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు గ్యాంగస్టర్ అతిక్ అహ్మద్ హత్య చేయించాయని ఉత్తరప్రదేశ్ మంత్రి ధరంపాల్ సింగ్ శనివారం ఆరోపించారు. చందౌసి నగరపాలక ఎన్నికల కోసం బీజేపీ కార్యకర్తల సదస్సులో శుక్రవారం ధరంపాల్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ను ఏప్రిల్ 15న హత్య గురైన విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్ లోని మెడికల్ కాలేజీకి వారిని పోలీసు సిబ్బంది తీసుకెళ్తుండగా జర్నలిస్టులుగా వచ్చిన ముగ్గురు హంతకులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఘటన అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అతిక్‌ను చంపడంలో ప్రతిపక్షాల ప్రమేయం ఉందన్నది నిజం. ప్రతిపక్షాల సీక్రెట్స్ బయటపెడతారనే భయంతోనే విపక్షాలు అతన్ని హత్య చేశాయి" అని మంత్రి ధరంపాల్ సింగ్ అన్నారు.
అతీఖ్ అహ్మద్ ను ప్రతిపక్ష పార్టీలు హత్య చేయించాయి !
April 22, 2023
0
Tags