క్షమాపణలు కోరిన దలైలామా !

Telugu Lo Computer
0


బౌద్ధ మత గురువు దలైలామా ముద్దు వివాదంలో చికుక్కున్న విషయం తెలిసిందే. నాలుకను చప్పరించాలని ఓ బాలుడిని కోరిన దలైలామా వీడియో తాజాగా ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ ఘటన పట్ల ఆ బాలుడికి, అతని కుటుంబానికి దలైలామా క్షమాపణలు చెప్పారు. అప్పుడప్పుడు దలైలామా తనను కలిసిన వారిని టీజ్ చేస్తారని , చాలా సరదాగా వారితో గడుపుతుంటారని ఆ గురువుకు చెందిన అధికార బృందం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఒక బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టారు. ఆ తర్వాత తన నాలుకను బయటకు చాపారు. దానిని చప్పరిస్తావా అని ఆ బాలుడితో అన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో పలువురు నెటిజన్లు ఆయన చర్యను విమర్శించారు. దలైలామా ఎందుకు అలా చేశారని కొందరు ప్రశ్నించారు. మైనర్‌ బాలుడి పట్ల ఆయన చర్యను ఎవరూ సమర్థించబోరన్నారు. అసహ్యకరమైన ఈ చర్యపై దలైలామాను అరెస్ట్‌ చేయాలని కొందరు డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)