కర్ణాటకలోని హవేరి జిల్లాలో 17 ఏళ్ల టీనేజర్‌కు దేవేంద్ర గౌడతో వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరి నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే బాలిక వేరొకరితో ప్రేమలో ఉన్నందున, ఆమె గౌడ్‌తో పెళ్లి ఇష్టం లేకపోవడంతో అతడిపై దాడి చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆమె తనకు కాబోయే భర్తకి బహుమతి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పి గౌడను పార్కుకు రప్పించింది. అతను యువతిని కలిసేందుకు పార్క్‌కు వెళ్లాడు. ప్లాన్ ప్రకారం బహుమతి ఇస్తానని గౌడ చేతులు కట్టేసి, కళ్లు మూసుకోమని చెప్పి, హఠాత్తుగా అతని మెడపై కత్తితో పొడిచింది. గౌడ తల్లిదండ్రులు బాలికపై హలగేరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేంద్ర గౌడను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాబోయే భర్తపై కత్తితో దాడి !
April 09, 2023
0
Tags