శాకుంతలం సినిమా విడుదలకు మందుకు సినీ నటి సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సమంత గత కొద్ది రోజులుగా షూటింగ్స్, శాకుంతలం ప్రమోషన్సులో మునిగిపోయారు. ఆమెకు తాజాగా జ్వరం వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బుధవారం సాయంత్రం తాను శాకుంతలం ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం లేదని తెలిపారు. "ఈ వారం అంతా నా సినిమాని ప్రమోట్ చేస్తూ, మీ ప్రేమలో మునిగితేలుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దురదృష్టవశాత్తూ తీవ్రమైన షెడ్యూల్‌లు, ప్రమోషన్ల వల్ల ఇబ్బంది పడ్డాను, నేను ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నాను. నా స్వరాన్ని కూడా కోల్పోయాను అని ట్వీట్ చేశారు. "ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న వార్షికోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నా. మా టీమ్‌తో కలిసి మీరూ పాల్గొనండి. మీ అందర్నీ నేను మిస్ అవుతున్నా" అని రాసుకొచ్చారు సమంత. దేవి థియేటర్ లో శాకుంతలం సినిమాకు సంబంధించి ఫ్లెక్స్ ల వీడియోపై కూడా సమంత స్పందించారు. ధన్యావాదాలు అంటూ రీట్వీట్ చేశారు. "14వ తేదీ నుండి అందరూ శాకుంతలం ప్రేమిస్తారు. మేము మా వంతు కృషి చేసాము.. శాకుంతలం త్వరలో మీ సొంతం అవుతుంది" అంటూ ట్వీట్ చేశారు. సమంత యశోద సినిమా తర్వాత నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిలె్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సామ్ శకుంతలగా నటించగా.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటించారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచానాలు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం మయోసైటిస్‌కు గురైన సమంత గత కొన్ని నెలల నుంచి సినిమాలకు దూరంగా ఉండి. ఈ మధ్యే షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు.
జ్వరంతో బాధపడుతున్న సమంత
April 12, 2023
0
Tags