వీధి కుక్కలు వెంటపడడంతో.... !

Telugu Lo Computer
0


ఒడిశాలో వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా సోమవారం వీధి శునకాలు వెంబడించడంతో తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన టూ-వీలర్‌పై వెళ్తుండగా శునకాలు వెంబడించాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ప్రమాదానికి గురైనారు. అదుపు తప్పిన టూవీలర్ కారును ఢీకొనడంతో ఒక్కసారిగా వారు గాలిలో ఎగిరి రోడ్డుపై పడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)