జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ జిల్లాలో ప్రజలు నడిచే బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డారు. బైశాఖీ వేడుకల్లో భాగంగా బేణీ సంగమం ప్రాంతంలో బెయిన్ గ్రామంలోని చెనానీ లోని వంతెన కూలింది. బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ఫుటోవర్ వంతెన పైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జమ్మూ కాశ్మీర్ లో కుప్ప కూలిన వంతెన
April 14, 2023
0
Tags