దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా కోవిడ్‌ మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 5వేల 880 పాజిటివ్‌లు నిర్దారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరుకుంది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమలు చేస్తున్నాయి. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో సౌకర్యాలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్‌, ఐసీయూ బెడ్‌ల వివరాలను సేకరిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు, వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలు గుర్తించి వైద్యారోగ్య శాఖకు అందజేయనున్నారు. హరియాణాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో జరిగిన మాక్‌ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పరిశీలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)