ఛత్తీస్‌గఢ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మందవి ఓ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్నారు. బీజాపూర్ మీదుగా ఆయన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో కాన్వాయ్ లో పంచాయతీ సభ్యుడు పార్వతీ కశ్యప్ కూడా ఉన్నారు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు కూడా నిర్ధారించారు. ఛత్తీస్‌గఢ్ లో ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులకు తెగబడుతున్న ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.
ఎమ్మెల్యే కాన్వాయ్‌పై మావోయిస్టుల కాల్పులు
April 18, 2023
0
Tags