కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బండి సంజయ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం అదే పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పేపర్లను లీక్ చేసి విద్యార్ధులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నీచ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిందన్నారు. పేపర్ లీకేజ్ కుట్రలో బండి హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికార ట్విట్టర్ అకౌంట్లో బండిపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ దొంగ సర్టిఫికేట్ తెలంగాణ బీజేపీ నాయకుల తీరు ఎట్లా ఉంది అంటే.. మేము చదువుకోలేదు..వేరే వాళ్ళను కూడా చదువుకోనివ్వం అన్నట్లుంది. అంటూ ఓ పోస్టర్ ని బీజేపీ లీక్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం !
April 05, 2023
0
Tags