మేనత్త కుయుక్తికి మేనల్లుడి బలి !

Telugu Lo Computer
0

కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో అరిక్కుళం అనే గ్రామంలో తాహిరా (38) అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఇంటి సమీపంలోనే సోదరుడు మహ్మద్‌ అలి భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. చాలాకాలం తాహిరా, ఆమె అన్న, వదినలు.. అందరూ చాలా సంతోషంగా కలిసి మెలసి ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం తాహిరాకు, ఆమె వదినకు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాహిరా తన వదినతో తరచూ గొడవపడేది. ఈ కారణంగా ఆహారంలో విషం కలిపి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుంది. సమీపంలోని షాప్ కి వెళ్లి,.. ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసింది. అనంతరం అందులో విషం కలిపిన తాహిరా సోదరుడి భార్యకు తినిపించాలని భావించి.. ఆమె ఇంటికి వెళ్లింది. తాహిరా వెళ్లిన సమయంలో ఇంట్లో ఆమె వదిన లేదు. దీంతో ఆ ఐస్‌క్రీమ్ ను అక్కడే వదిలి తిరిగి తన ఇంటికి వచ్చింది. అదే సమంయలో ఇంట్లో ఉన్న మేనల్లుడు అహ్మద్‌ హసన్‌ రిఫాయీ (12) ఆ ఐస్‌క్రీం తిన్నాడు. ఆ తరువాత కాసేపటికి వాంతులు చేసుకుంటూ కిందపడిపోయాడు. బాలుణ్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ బాలుడు సోమవారం మృతిచెందాడు. నిందితురాలు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది. ఇలా పెద్దలపై కోపంతో పిల్లల ప్రాణాల తీస్తున్న ఘటనలు నిత్యం అనేకం జరుగుతున్నాయి

Post a Comment

0Comments

Post a Comment (0)