మహరాష్ట్ర సీనియర్ ఎన్సీపీ నేత, మాజీ మంత్రి అజిత్ పవార్ మోడీ డిగ్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల డిగ్రీలపై ప్రశ్నించడం సరికాదని, ఆ మంత్రి ప్రజలకు ఏం చేశారన్నదే చూడాలని ఆయన అన్నారు. 2014లో మోడీ డిగ్రీ చూసి ప్రజలు ఆయనకు ఓటేశారా ? అని ప్రశ్నించారు. ఆయనకు ఉన్న ప్రజాకర్షణే ఆయన్ను గెలిపించిందని అన్నారు. ఈ సమయంలో డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదని, ద్రవ్యోల్భణం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా ? అని ప్రశ్నించాలని అని సూచించారు. మోడీ డిగ్రీకి సంబంధించి ఏడేళ్ల కేసులో కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు కొట్టేసింది. ఈ సమాచారాన్ని కోరిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జరిమానా విధించింది. అయితే ఆయన ఈ తీర్పు అనంతరం మాట్లాడుతూ మోడీ విద్యార్హతపై మరింత అనుమానాలు పెరిగాయని, మోడీ నిజంగా విద్యావంతుడు అయితే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదని కేజ్రీవాల్ విమర్శించారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఆయన ప్రభుత్వం అవినీతిపై దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకువస్తుంటే కేజ్రీవాల్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించింది.
మోడీని గెలిపించింది జనాకర్షణ !
April 04, 2023
0
Tags