ప్రతిష్టాత్మక 59వ ఎడిషన్ ఫెమీనా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోని కుమన్ లంపక్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ ఏడాది రాజస్థాన్ కు చెందిన 19 ఏండ్ల నందినీ గుప్తా ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 29 రాష్ట్రాలకు చెందిన అందాల భామలు మిస్ ఇండియా కిరీటం కోసం పోటీ పడ్డారు. చివరికి తన అందం, అభియనంతో ఆకట్టుకున్న నందినీ గుప్తా విజేతగా నిలిచింది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీశెట్టి, నందినికి కిరీటాన్ని అలంకరించారు. ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ వరుసగా మొదటి, రెండో రన్నరప్ గా నిలిచారు.
ఫెమీనా మిస్ ఇండియా విజేత నందినీ గుప్తా
April 16, 2023
0
Tags