కర్ణాటకలోని హుణసూరు తాలూకా తొండాళుకు చెందిన రాజశెట్టి (40) అనే వ్యక్తి శనివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి వెళ్లే దారిలో ఎదురైన గ్రామస్థులతో గొడవ పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని మందలించి, ఇంటి దగ్గర వదలిపెట్టి వెళ్లారు. అందరూ దూషించారని మనస్థాపం చెంది, గట్టిగా కేకలు వేశాడు. అనంతరం కొడవలి తీసుకుని మర్మాంగాన్ని కోసుకుని కిందపడిపోయాడు. అది గమనించిన కుటుంబసభ్యులు.. స్థానికుల సహాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుణసూరు పోలీసులు తెలిపారు.
మైకంలో మర్మాంగాన్ని కోసుకున్నాడు !
April 10, 2023
0
Tags