సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపది ముర్ము

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసుఖోయ్‌ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. అస్సాంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి ఫైటర్‌ జెట్‌లో ప్రయాణించారు. తేజ్‌పూర్‌లోని భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. అక్కడ భద్రతా దళాల నుంచి సైనిక వందనం అందుకున్నారు. తరువాత ఆమె ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి సుఖోయ్‌-30 విమానంలో బ్రహ్మపుత్ర,తేజ్ పూర్ లోయలను కవర్ చేస్తూ 30 నిమిషాలపాటు విహరించారు. ద్రౌపది ముర్ము ప్రయాణించిన సుఖోయ్ విమానాన్ని 106 స్వ్రాడ్రన్ కమాండింగ్ అధికారి గ్రూప్‌ కెప్టెన్‌ నవీన్‌ కుమార్‌ తివారీ నడిపారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది. ఈ ఏడాది మార్చిలో ద్రౌపది ముర్ము INS విక్రాంత్ ను సందర్శించారు. స్వదేశీయంగా తయారు చేసిన ఈ విమానంలో అధికారులతో ఆవిడ సంభాషించారు. కాగా.. 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించిన విషయం సుఖోయ్-30 MKI విమానం రష్యాకు చెందిన సుఖోయ్ అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ మల్టీరోల్ ఫైటర్ జెట్. అలాగే భారతదేశపు ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో నిర్మించబడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)