మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఫూల్ బాగ్‌లో ఓ యువతి రోడ్డుపై ఉన్న వ్యక్తులను దుర్భాషలాడడం, వాహనాలను ఆపి వాటి పైకి ఎక్కి నానాహంగామా సృష్టించింది. అంతేకాకుండా ఆ అమ్మాయి ఓ వృద్ధుడి స్కూటీని లాక్కొని స్వయంగా నడపడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించిన ఆమె అస్సలు వినలేదు. దీని తర్వాత ఆమె రోడ్డుపై ఉంచిన బారికేడ్లను కూడా విసరడం ప్రారంభించింది. అనంతరం ఆమె పిచ్చిగా కేకలు వేస్తూ కదులుతున్న కారు బానెట్ మీద నిలబడి చేతిలో కత్తి పట్టుకుని నా లవర్ నన్ను మోసం చేశాడని గట్టి గట్టిగా కేకలు వేస్తుండటంతో కారు డ్రైవర్ తన కారును పక్కన పెట్టాడు. అక్కడే వున్న కొంత మంది వ్యక్తులు ఆమెను కారు నుండి దిగమని బతిమలాడినా, అమ్మాయి అంగీకరించకపోగా, ఆమె దిగి కారు డ్రైవర్‌పై అరుస్తూ తన దగ్గర వున్న కత్తితో అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. దీంతో స్థానికులు అమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. లేడీ మత్తులో ఉందా ? అని అడుగుతున్నారు. మరోవైపు ఆ యువతి మానసిక పరిస్థితిపై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలు దీనిని చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు. మరి కొందరు ట్రూలవ్ ని ఎవరు నమ్మరు, మనసు విరిగితే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
నడిరోడ్డుపై యువతి నానా హంగామా !
April 02, 2023
0
Tags