తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని ఈరోడ్ సమీపంలోని సెంథిల్ నగర్ లో రవికుమార్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జ్యోతిమణి అలియాస్ జ్యోతి (36) అనే మహిళను రవికుమార్ వివాహం చేసుకున్నాడు. మద్యంకు బానిస అయిన రవికుమార్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మార్చి 22వ తేదీన రవికుమార్ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య జ్యోతిని కొట్టడం ప్రారంభించాడు. నేను ఇంటిలో లేని సమయంలో నువ్వు ఎవ్వరితో తిరుగుతున్నావు అంటూ రెచ్చిపోయిన రవికుమార్ అతని భార్య జ్యోతిని చితకబాదేశాడు. ఆ సమయంలో భర్త రవికుమార్ వేధింపులు తట్టుకోలేని జ్యోతి వంటగదిలోకి పారిపోయింది. అక్కడికి వెళ్లిన రవికుమార్ భార్య జ్యోతిని చితకబాదేశాడు. సహనం కోల్పోయిన జ్యోతి దోసలు వేసే పాన్ తీసుకుని ఆమె భర్త రవికుమార్ తలపై దాడి చేసి అతని శరీరం మీద అనేక చోట్ల కొట్టింది. ఈ సమయంలో రవికుమార్ స్పృహ తప్పి వంటగది పక్కన పడిపోయి తరువాత పైకి లేవలేదు. తరువాత జ్యోతి అంబులెన్స్ పిలిపించి ఆమె భర్త రవికుమార్ ను తీసుకెళ్లి ఈరోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత తన భర్త గుండెపోటు వచ్చి చనిపోయాడని ఊరు అందరికి, బంధువులకు చెప్పి నమ్మించింది. రవికుమార్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొడుకు మృతిపై రవికుమార్ తండ్రి అనుమానం వచ్చి తిరుమురుగన్‌పూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం రవికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గట్టి వస్తువుతో రవికుమార్ మీద దాడి చేశారని, శరీరంపై గాయాలు ఉన్నాయని తేలింది. అనంతరం అతని భార్య జ్యోతిని పోలీసులు విచారించగా తన భర్త రవికుమార్‌ను హత్య చేసినట్లు అంగీకరించింది. రోజు తాగి వచ్చి కొడుతున్నాడని, ఓపిక నశించింది దోసెలు వేసే పాన్ తో కొట్టి హత్య చేశానని జ్యోతి అంగీకరించింది పోలీసులు అన్నారు. జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించామని పోలీసులు తెలిపారు.
భర్త వేధింపులు తాళలేక పాన్ తో కొట్టి చంపిన భార్య !
April 07, 2023
0
Tags