గుంట నక్కలను వెంటేసుకున్న ముసలి పులి చంద్రబాబు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్ధుల తల్లిదండ్రుల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. రిపబ్లిక్ టీవీకి వచ్చీరాని ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూను ఇచ్చారని చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు. ఆ ఇంటర్వ్యూను పంచతంత్రం కథతో పోలుస్తూ.. చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వేటాడే శక్తిని కోల్పోయిన పులి గుంటనక్కలను వెంటేసుకొందని.. మాయా మాటలు చెప్పి నీటి గుంట వద్దకు వచ్చినవారిని ఆ పులి చంపి తినేదని జగన్ చెప్పారు. ఆ పులి అడవిలో తనకు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటుందని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ కథలోని ముసలి పులి లాంటి వాడు చంద్రబాబు అని, ఇక గుంటనక్కలు ఆయన వెనకున్న వారని సీఎం చెప్పారు.. బంగారం కడియం ఆశ చూపి మనుషులను మింగేసే పులి బాపతు వెన్నుపోటు పొడిచే తత్వం చంద్రబాబుదని విమర్శలు చేశారు. మాయమాటలు చెప్పే చంద్రబాబు లాంటి వారిని నమ్మకూడదని ప్రజలను కోరారు. 2014లో పంట రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసి గెలిచాడన్నారు. మోసం చేసేందుకు మళ్లీ సిద్ధమయ్యాడని.. దోచుకో, పంచుకో, తినుకో అనేది చంద్రబాబు సిద్దాంతంగా జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు తోడుగా గజదొంగల ముఠా ఉందన్నారు. ఎల్లో మీడియా, పవన్ కళ్యాణ్ బాబుకు తోడుగా ఉన్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు అబద్దాలను , మోసాలను చూసి నమ్మవద్దని సీఎం కోరారు. జగనన్నతో మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూడాలని ఈయన ప్రజలను కోరారు. తన నమ్మకం, ఆత్మవిశ్వాసం మీరేనని జగన్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)