చీర కోసం సిగపట్లు !

Telugu Lo Computer
0


బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూర్ సిల్క్ శారీ సెంటర్ ఇటీవల డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించింది. తక్కువ ధర, మంచి క్వాలిటీతో చీరలు అమ్ముతుండటంతో తమకు నచ్చిన చీరలు కొనుక్కునేందుకు మహిళలు ఆ షాపుకు భారీగా తరలివచ్చారు. ఎవరికి నచ్చింది వారు కొనుక్కుంటున్నారు. అక్కడికి వచ్చిన ఇద్దరి మహిళలకు ఒకే చీర బాగా నచ్చింది. దీంతో నాకు కావాలంటే నాకు కావాలి అని గొడవకు దిగారు. మాటామాటా పెరిగి సిగపట్టుకు సిద్ధమయ్యారు. జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు అక్కడి సిబ్బంది చాలా శ్రమపడాల్సింది వచ్చింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు 

Post a Comment

0Comments

Post a Comment (0)