తమిళనాడులో 24 గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు లిక్కర్ ఏటీఎంలను స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి చెన్నైలోని కోయంబేడు తో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఈ మెషిన్లను అధికారులు ప్రారంభించారు. ఏటీఎంలానే పని చేసే ఈ మెషిన్లలో ముందుగా పైన కనిపించే బ్రాండ్లలో కావాల్సిన బ్రాండ్ ను ఎంచుకోవాలి. వెంటనే దాని ధరను మెషిన్ చూపిస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్ లైన్ లో చెల్లిస్తే మెషిన్ కింది బాగంలో నుంచి సీసా బయటకు వస్తుంది. ఈ మెషిన్లు అందుబాటులోకి రావడంతో ఇక మద్యం షాపులు మూసేస్తారని కానీ ఉదయాన్నే వైన్స్ తెరవరని కానీ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.
చెన్నైలో లిక్కర్ ఏటీఎంలు
April 29, 2023
0
Tags