వారి రాష్ట్రం కోసం వాళ్లు చూసుకుంటే చాలా సంతోషం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి గురించి మాట్లాడటానికి హరీశ్‌రావు (తెలంగాణ మంత్రి) ఎవరు? అతనికేమిటి సంబంధం అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే దానికి మేం సమాధానం చెబుతామా ? బాధ్యతగల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి అని పేర్కొన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 'ప్రత్యేక హోదా లేకపోవడంపై ఎవరు మాట్లాడతారో ? ఎవరు మాట్లాడరో మాకు తెలుసు. వారి రాష్ట్రం కోసం వాళ్లు చూసుకుంటే చాలా సంతోషం. చరిత్రలన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరంలేదు. ఏపీ ప్రజలు తెలంగాణలో ఉండాలనుకుంటున్నారో.. తెలంగాణ ప్రజలు అమెరికాలో ఉండాలని కోరుకుంటున్నారో అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది హరీశ్‌రావునే అడగండి. ఆయన రాజకీయాల కోసం ఏదో మాట్లాడుతారు' అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రస్తుతమున్న జోన్లు, ఏ జోన్‌లో ఏముంది? స్థానికతకు అర్థం ఏమిటి? అనే వాటిపై చర్చించి ఓ ముసాయిదా (డ్రాఫ్ట్‌) సిద్ధం చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి కేబినెట్‌ ముందుకు తీసుకొస్తామని చెప్పారు. జోనల్‌ వ్యవస్థ, స్థానికత అంశాల్లో మార్పులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశాలపై మంత్రుల కమిటీ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఇందులో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)