తెలంగాణ లోని ప్రభుత్వ హాస్పిటళ్లల్లో సిజేరియన్ (సీ సెక్షన్) కాన్పులు పెరిగాయి. 2020--21లో 46.3 శాతం సిజేరియన్లు జరగగా, ఆ తర్వాతి ఏడాది 47.13 శాతం ఆపరేషన్లు జరిగాయి. అలాగే, ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు 65.34 శాతం నుంచి 61.08 శాతానికి తగ్గాయి. ప్రైవేటులో కాస్త తగ్గినా గవర్నమెంట్ ఆస్పత్రులతో పోలిస్తే అధికంగానే సిజేరియన్లు జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసిన హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్‌ఎంఐఎస్) రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు, దేశంలో అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్‌లో ఉందని తెలిపింది. అంతకుముందుతో పోలిస్తే సిజేరియన్లు కాస్త తగ్గినా దేశ సగటుతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. 2020-21, 2021-22కు సంబంధించిన డేటాను రిపోర్ట్‌లో వెల్లడించింది. 2020-21లో మొత్తం 55.33 శాతం సిజేరియన్లు నమోదు కాగా, 2021-22లో 54.09 శాతం సిజేరియన్లు జరిగాయి. జాతీయ సగటు 23.29 శాతంతో పోలిస్తే తెలంగాణలో జరుగుతున్న సీ సెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో తెలంగాణ తర్వాత తమిళనాడు (52.1%), హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ తెలంగాణ తర్వాత ఉన్నాయి. 2020-21లో సిజేరియన్లలో తమిళనాడు (56%) ముందుండగా, 2021-22లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌కి చేరింది.
సిజేరియన్ కాన్పుల్లో తెలంగాణ టాప్ !
April 27, 2023
0
Tags