గాయని చిత్ర వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతులేని విషాదం దాగుంది. తన పాటలతో శ్రోతల మనసులను తేలిక చేసే చిత్ర గుండెల్లో మాత్రం ఎంతో దుఃఖం దాగుంది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టిన తన కూతురు అకాల మరణం ఆమెను కలిచివేసింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న చిత్ర, విజయ్ శంకర్ అనే ఒక ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత వీరికి నందన జన్మించింది. ఆ పాప మనిషిలో అసలు ఎదుగుదలలేని డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు 2011లో ఓ కచేరిలో పాల్గొనడానికి చిత్ర వెళ్లగా అదే సమయంలో స్విమ్మింగ్ పూల్లో పడి కన్నుమూసింది. ఈరోజు చిత్ర కూతురు మరణించిన రోజు. ఆమెను గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నోట్ షేర్ చేసింది చిత్ర. 'మా హృదయాలు నీ జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. మేము నీ గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నాము. నువ్వు లేకుండానే మా జీవితం ముందుకు సాగిపోతుంది. కానీ ఇది ఎప్పటికీ ఒకేలా మాత్రం ఉండదు. మా ప్రియమైన నందన నిన్ను ప్రేమగా స్మరించుకుంటున్నాము' అంటూ కూతురి ఫోటోను చిత్ర షేర్ చేశారు.
కూతురిని స్మరించుకుంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసిన చిత్ర
April 15, 2023
0
Tags