సీబీఐ స్టేట్మెంట్ లు తీసుకోవడం తప్ప, దర్యాప్తు చేయడం లేదు !

Telugu Lo Computer
0


వైయస్ వివేకానంద రెడ్డి  హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. మరో 10 రోజుల్లో విచారణ మొత్తం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేయటం తెలిసిందే. కేసు చివరి దశకు చేరుకోవడంతో మరి కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఆదివారం ఉదయం పులివెందులలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకు తరలించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేయటం జరిగింది.తనని సీబీఐ విచారణకు పిలిచిన క్రమంలో పిటిషన్ దాఖలు చేయడంతో  ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డి అరెస్టు చేయకూడదని, సీబీఐ విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డు చేయాలని కోరడం జరిగింది. ఇదిలా ఉంటే వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిని సీబీఐ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీబీఐ స్టేట్ మెంట్ లు తీసుకోవడం తప్ప, దర్యాప్తు చేయడం లేదని స్పష్టం చేశారు. భాస్కర రెడ్డి, అవినాష్ రెడ్డి లపై నేరం మోపాలని ముందుగా నిర్ణయించారని ఆరోపించారు. ఇష్టానుసారంగా సీబీఐ పేర్లు చేరుస్తుంటే ఎల్లో మీడియా ప్రింట్లు ఇస్తుందని మండిపడ్డారు. దస్తగిరి విరుద్ధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)