గూగుల్‌ పే ద్వారా యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ఆఫర్ !

Telugu Lo Computer
0


గూగుల్ పే ద్వారా యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన ఏస్ క్రెడిట్ కార్డు కోసం సులభంగా అప్లై చేసుకోవచ్చు. యాప్‌లోకి వెళ్లిన తర్వాత  కార్డు ఆఫర్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత అవసరమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేదంటే లేదు. ఈ కార్డు కోసం గూగుల్ పే ద్వారా అప్లై చేసుకుంటే రూ. 500 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈ డబ్బులు కార్డు డెలివరీ తర్వాత నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోనే జమ అవుతాయి. ఈ కార్డు ద్వారా ఏటా రూ. 12 వేలు డబ్బులు ఆదా చేసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. కార్డు ద్వారా కొనుగోలు చేసేటప్పుడు పలు రకాల ఇతర ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా ఈ కార్డు సాయంతో చేసే అన్ని బిల్ పేమెంట్స్, రీచార్జులపై 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఇతర ఖర్చులపై అయితే 2 నుంచి 4 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఒక ఏడాదిలో ఈ కార్డుపై 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఒక శాతం ఫ్యూయెల్ సర్ చార్జ్ కూడా ఉంటుంది. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు. కార్డు ఫీజు రూ. 499 చెల్లించాలి. కార్డు జారీ అయిన 45 రోజులలోగా మీరు రూ. 10 వేల ఖర్చు చేస్తే ఈ ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు.  ఫీజు వెనక్కి చెల్లిస్తారు. రెండో ఏడాది నుంచి ఏటా రూ. 499 కడుతూ రావాలి. రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే  ఈ చార్జీ మినహాయింపు ఉంటుంది. కార్డు రిప్లేస్‌మెంట్ చార్జీలు ఉండవు. క్యాష్ పేమెంట్ ఫీజు రూ. 100 ఉంటుంది. మొబైల్ అలర్ట్స్ ఫ్రీ. డూప్లికెట్ స్టేట్‌మెంట్ ఉచితం. ఇక ఫైనాన్స్ చార్జీలు నెలకు 3.6 శాతంగా ఉంటాయి. అంటే ఏడాదికి 52.86 శాతం. క్యాష్ విత్‌డ్రాయెల్ ఫీజు 2.5 శాతంగా పడుతుంది. ఓవర్ లిమిట్, ఓవర్ డ్యూ చార్జీలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)