ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల ప్రధానమైన ఊహాగానాలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి నితీష్ మంచి చొరవ తీసుకున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. నితీష్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రటించారు. దేశం చాలా కష్టకాలంలో నడుస్తోందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని తాను చాలాసార్లు చెప్పాను అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బిజెపితో తీవ్ర పోటీని కలిగి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తరచుగా ఆరోపిస్తోంది.
నితీష్ కుమార్ తో కేజ్రీవాల్ భేటీ !
April 13, 2023
0
Tags