దేశంలో కొత్తగా 4,282 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,282 కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 47,246 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,43,70,878 మంది కోలుకున్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,547కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.11 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)