తెలంగాణలో రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 41 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారు వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లల్లో చికిత్స పొందుతున్నారు. 30 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,43,003కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 8,38,623 మంది ఉన్నారు. 4,111 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 269గా నమోదైంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ బులెటిన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారం రోజులుగా కేసుల సంఖ్యను చూస్తే.. 11వ తేదీన 12 కేసులు నమోదయ్యాయి. 12వ తేదీన- 14, 13వ తేదీన- 18, 14వ తేదీన- 19, 15వ తేదీన 8, 16వ తేదీన- 12, 17వ తేదీన 19 కేసులు రికార్డయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 41 కరోనా కేసులు నమోదు
April 18, 2023
0
Tags