పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలాజీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. మొదటి పెళ్లి విఫలం కావడంతో ఆయన రెండవ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు. ఇందుకు మాట్రిమోనియల్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. అది చూసిన అమెరికాలోని సోమశ్రీ నాయర్ అనే యువతి బాలాజీతో కాంటాక్ట్ అయింది. బాలాజీకి అప్పటికే వివాహమై భార్యాభర్తల మధ్య గొడవలొచ్చి విడిపోయారు. వయసు 36 ఏళ్లే కావడంతో రెండో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో బంధువులు బాలాజీకి సూచించారు. దీంతో రెండో పెళ్లి చేసుకునేందుకు మ్యాట్రిమోనీలో తన పూర్తి వివరాలు నమోదు చేశాడు. దీంతో బాలాజీది హై ప్రొఫైల్ కావడంతో చాలా కాల్స్, మెసేజ్ లు వచ్చేవి. ఈ విధంగానే బాలాజీకి సోమశ్రీ పరిచయమయ్యింది. తాను అమెరికాలో డాక్టర్ చదువుకున్నానని చెప్పింది. ప్రస్తుతం సిరియాలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపింది. ఇద్దరిది ఒకే వృత్తి కావడంతో బాలాజీకి సోమశ్రీ అంటే ఇష్టం ఏర్పడింది. ముందు ఒకరినొకరం అర్థం చేసుకుని నచ్చితే పెళ్లి చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అన్నట్లుగానే చాలాకాలం ఇద్దరు మాట్లాడుకున్నారు. రానురాను బాలాజీకి ఆ అమ్మాయిపై ఇష్టం పెరిగింది. సోమశ్రీ తనకు హఠాత్తుగా డబ్బు అవసరం వచ్చిందని బాలాజీని వివిధ దఫాలుగా రూ.35 లక్షలు అడిగినట్లు సమాచారం. ఈ డబ్బు ఆమెకు అందిన తరువాత సోమశ్రీ బాలాజీతో మాట్లాడడం తగ్గిపోయింది. ఫోన్ చేసినా తాను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసేది. చాలాసార్లు అలా కావడంతో బాలాజీకి అనుమానం వచ్చింది. దాంతో బాలాజీ ఆమె మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ అడిగాడు. కానీ సోమశ్రీ నుంచి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న తర్వాత సోమశ్రీ బాలాజీతో పూర్తిగా మాట్లాడటం మానేసింది. మోసపోయానని గ్రహించిన బాలాజీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పేరుతో డాక్టర్ కి రూ.35లక్షలు టోకరా !
April 24, 2023
0
Tags