మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ ఐదంతస్తుల హోటల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి హోటల్లోని రెండు అంతస్తులకు విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. హోటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి యత్నిస్తున్నారు. ఓ మహిళ, ఇద్దరు చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ఐదంతస్తుల హోటల్లో అగ్నిప్రమాదం
March 29, 2023
0
Tags