మహిళపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0


కర్నాటకలోని కోలార్ జిల్లాలో మహిళా దినోత్సవం రోజు షాపింగ్ మార్కెట్‌ను బీజేపీ ఎంపీ మునిస్వామి ప్రారంభించిన సందర్భంగా అక్కడున్న స్టాల్‌లో మహిళను ఉద్దేశించి నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు. ఇక్కడ షాప్ పెట్టుకునేందుకు నీకు ఎవరు అనుమతించారు. నీ భర్త ఇప్పుడు బతికే ఉన్నాడుగా, అయినా బొట్టు ఎందుకు పెట్టుకోవు. నీకు కామన్‌సెన్స్ లేదా అంటూ నోరుపారేసుకున్నారు. మహిళపై మునిస్వామి నోటిదురుసు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు మండిపడ్డారు. మహిళలపై బీజేపీ నేతలు మోరల్ పోలీసింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ భారత్‌ను హిందుత్వ ఇరాన్‌లా మార్చాలని చూస్తోందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)