తెలుగు, తమిళ ప్రేక్షక హృదయాలను ఆకట్టుకొని, తన అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ సుందర్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళలకు సంబంధించిన వేధింపులపై మాట్లాడుతూ తన జీవితంలోని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఖుష్బూ తన చిన్నతనంలో వేధింపులకు గురయ్యానని చెప్పారు. తాను తన తండ్రి నుండే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్న ఖుష్బూ తన జీవితంలోని చేదు అనుభవాలను వెల్లడించారు. తనకు ఎనిమిదేళ్ల వయసు నుండే తండ్రితో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఖుష్బూ సుందర్ చెప్పుకొచ్చారు. తనపై జరుగుతున్న లైంగిక వేధింపులను తన తల్లితో చెప్పినా ఫలితం ఉండేది కాదని, అమ్మ తన మాటలను నమ్మేది కాదని ఖుష్బూ సుందర్ వెల్లడించారు. అప్పట్లో ఇళ్లల్లో మహిళలు భర్త ఏం చేసినా కరెక్ట్ అన్న, పతియే ప్రత్యక్ష దైవం అన్న అభిప్రాయంలో ఉండేవారని, ఇక ఆ భావనతోనే తన తల్లి తన మాటలను పట్టించుకునేది కాదని ఖుష్బూ పేర్కొన్నారు. చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదురైతే ఆ అమ్మాయి జీవితం నరకంలా ఉంటుందని, తాను అనుభవంతో చెబుతున్నానని ఖుష్బూ పేర్కొన్నారు. ఇక తాను తన తండ్రి తీరుపై తిరుగుబాటు చేశానని పేర్కొన్న ఖుష్బూ, ఆయన వేధింపులు భరించలేక 15 ఏళ్ల వయసు నుండి తన తండ్రి పై తాను తిరగబడ్డానని చెప్పారు. తన 16వ ఏట తన తండ్రి మరణించాడని పేర్కొన్న ఖుష్బూ, అప్పుడు తమ పరిస్థితి దయనీయంగా ఉండేదని, కనీసం పూట గడవని పరిస్థితి ఇంట్లో ఉండేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో మగవాళ్ళు భార్యలను తిట్టడం కొట్టడం, పిల్లలను వేధించడం, ఆడపిల్లలను సైతం నోటికొచ్చినట్టు తిట్టడం తమ జన్మ హక్కుగా భావించేవారని ఖుష్బూ చెప్పుకొచ్చారు. తాజాగా తన తండ్రి గురించి షాకింగ్ విషయం వెల్లడించిన ఖుష్బూ సమాజంలో నేటి కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పుకొచ్చారు. మహిళలు సమస్యలు వచ్చినప్పుడు, లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాలని సూచించారు.
నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు: ఖుష్బూ
March 06, 2023
0
Tags